స్విమ్స్ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం
స్విమ్స్ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో తితిదే ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేస్తామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తితిదే పాలక మండలి సమావేశం ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోర్డు తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. మార్పులు, చేర్పులతో గరుడ వారధిని పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధానికి పాలక మండలి తీర్మానం
తిరుపతిలో మద్యపాన నిషేధంపై చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఎంపిక చేసిన శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులకు ‘బ్రహ్మోత్సవ బహుమానం’ అందిస్తామన్నారు. దీనిలో భాగంగా శాశ్వత ఉద్యోగులకు రూ.14వేలు, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6,850 ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. తిరుమలలో మూడు నెలల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని తీర్మానించినట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.