రహదారి నిబంధనలు అందరూ పాటిస్తే ప్రమాదాలు నివారించొచ్చని డీఎస్పీ అరీఫుల్లా తెలిపారు.ఆటో చోదకులు పరిమితికి మించి ప్రయాణికులను తరలించొద్దని సూచించారు.ద్విచక్ర వాహనదారులు విధిగా శిరస్త్రాణం ధరించాలని చెప్పారు. ఇందులోభాగంగా రోడ్డు ప్రమాదాల నివారణపై వీడియో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సీఐ కృష్ణమోహన్, ఎస్ఐ మురళి మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.
రహదారి భద్రతపై అవగాహన అవసరం - చిత్తూరు జిల్లా
రహదారి భద్రతపై ప్రతిఒక్కరికీ అవగాహన అవసరమని పలమనేరు డీఎస్పీ అరీఫుల్లా తెలిపారు. చిత్తూరు జిల్లా శాంతిపురంలో రహదారి భద్రతపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
అవగాహన సదస్సు నిర్వహిస్తున్న డీఎస్పీ