ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పూతలపట్టు కేంద్రంలోని ఎస్వీసెట్ ఇంజనీరింగ్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిలుగా జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఎస్పీ వెంకటప్ప నాయుడు హాజరయ్యారు. ముందుగా కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో మెుక్కలు నాటారు. అనంతరం యాంటీ ర్యాగింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. హద్దులు మీరిన ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. విద్యార్థులు ఐక్యంగా ఉంటేనే ఎదైనా సాధించగలరని తెలిపారు. భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఈనాడు ఈటీవీ చేపట్టిన కార్యక్రమంపై కలెక్టర్ స్పందించారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరిన్ని కాలేజీల్లో ఏర్పాటు చేస్తే తమ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
'ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు' - చిత్తూరు జిల్లా పూతలపట్టు
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని ఎస్వీసెట్ ఇంజనీరింగ్ కళాశాలలో, ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఎస్పీ వెంకటప్పనాయుడు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
!['ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4257694-184-4257694-1566910508536.jpg)
'ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు'
'ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు'
ఇది చూడండి: ర్యాగింగ్ భూతం..జూనియర్‌పై సీనియర్ దాడి