చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో చింతపండు పరిశ్రమకు ప్రసిద్ధి గాంచిన కురబలకోటలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో పరిశ్రమలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నైపుణ్య అభివృద్ధి పెంపు, ఉత్పత్తి, నాణ్యత, విక్రయాలు, గిట్టుబాటు ధర, చింత చెట్ల పెంపకం ఇతర అంశాలపై పరిశ్రమల నిర్వాహకులు, రైతు కూలీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
చింతపండు సాగు రైతులకు అవగాహన సదస్సు - mla peddireddy dwarakanadh reddy latest news
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అధ్యక్షతన చిత్తూరు జిల్లా కురబలకోటలో చింతపండు సాగు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై రైతు కూలీలకు నిర్వాహకులు అవగాహన కల్పించారు.
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చింతపండు సాగు రైతులకు అవగాహన సదస్సు
ఇవీ చూడండి..:చంద్రగిరి మండలంలో కర్ణాటక మద్యం పట్టివేత