కరోనా సోకకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల గ్రామాల్లో వైద్యులు ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో వైద్యులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులు, సంఘ సేవకులు చైతన్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టారు. వందమందికి పైగా విదేశాల నుంచి వచ్చిన వారిని గృహ నిర్బంధంలో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉంటే పూర్తిస్థాయి పరీక్షల కోసం తిరుపతి సిమ్స్‌కు పంపుతున్నారు. తుమ్మలపల్లి వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఫీవర్ సెల్‌ను, ప్రత్యేక అత్యవసర చికిత్స వార్డును ఏర్పాటు చేశారు.
'కరోనా లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోండి' - కరోనా వార్తలు
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలోని గ్రామాల్లో... వైద్యులు కరోనాపై అవగాహన కల్పించారు. కరోనా లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.
తంబళ్లపల్లెలో కరోనాపై అవగాహన కార్యక్రమం