చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలంలో కరోనాపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. తంబళ్లపల్లి ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ రెండో విడత కరోనా విజృంభించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డైరెక్టర్ లలితమ్మ ఆధ్వర్యంలో కళాకారులు చైతన్య గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. పెద్దమండ్యం మండలంలోని కలిచర్ల, ముసలికుంట, పి.తురకపల్లి గ్రామాల్లో ఆదివారం రాత్రి వరకు కరోనాపై చైతన్య కళాజాత నిర్వహించారు.
ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన - today Awareness on the Corona news update
కరోనాపై తంబళ్లపల్లి ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలంలో కళాకారులు చైతన్య గీతాలు ఆలపించారు.
చైతన్య గీతాలు ఆలపిస్తున్న కళాకారులు