ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిశ చట్టాన్ని అందరూ వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే రోజా

ప్రతీ ఒక మహిళ దిశా యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలని నగరి ఎమ్మెల్యే రోజా సూచించారు. పుత్తూరులోని ఓ ప్రైవేట్ కళ్యాణ మంటపంలో దిశా చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅథితిగా హాజరయ్యారు.

Awareness on Disha app
వజ్రాయుధం లాంటి దిశ చట్టం

By

Published : Jul 21, 2021, 9:53 PM IST

Updated : Dec 14, 2022, 12:28 PM IST

మహిళలు సమాజానికి ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి జగన్​ ఆకాంక్షిస్తున్నారని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. అందులో భాగంగానే మహిళా భద్రత కోసం వజ్రాయుధం లాంటి దిశా చట్టాన్ని విడుదల చేశారని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ దిశా యాప్​ను వినియోగించుకోవాలని రోజా సూచించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో పుత్తూరు సబ్ డివిజన్ అధికారి యశ్వంత్ అధ్యక్షతన దిశా చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅథితిగా హాజరయ్యారు. రానున్న సమాజానికి మహిళలు ఆదర్శవంతంగా నిలవాలనే ఆకాంక్షతో వారికి అండగా వైకాపా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో వృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

గత ప్రభుత్వ హయాంలో మహిళలకు ప్రాధాన్యత లేదని.. వారిపై దాడులు, హత్యాయత్నాలు జరిగినా పట్టించుకోని సందర్భాలు చూశామన్నారు. అనంతరం ఎమ్మెల్యే రోజాను పోలీసులు సన్మానించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Last Updated : Dec 14, 2022, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details