తిరుమల ప్రత్యేకాధికారిగా ఏవీ ధర్మారెడ్డి బాధ్యతలు - take
తిరుమల ప్రత్యేకాధికారిగా ఏవీ ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టారు. మాజీ జేఈవో శ్రీనివాసరాజు స్థానంలో నియామకం అయ్యారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని ధర్మారెడ్డి తెలిపారు.
ttd
తితిదే ప్రత్యేకాధికారిగా ఏవీ ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఉదయం ఎనిమిదన్నర గంటలకు ఆలయంలోని రంగనాయకుల మండపానికి చేరుకున్న ఆయన... ఈవో అనిల్ సింఘాల్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్న ధర్మారెడ్డి దంపతులకు... ఆలయ పండితులు వేదాశీర్వచనం చేశారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేదుకు కృషి చేస్తానని ధర్మారెడ్డి అన్నారు.