చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట తితిదే గోశాల సమీపంలో... ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయపు నడకకు వచ్చిన వారు చూసి ఎంఆర్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి తుమ్మలగుంట గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ చంద్రగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
తుమ్మలగుంటలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య - తిరుపతిలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య వార్తలు
ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన.. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట తితిదే గోశాల సమీపంలో జరిగింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తుమ్మలగుంటలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య