చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో... న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. పట్టణంలో వ్యక్తిగత పనికోసం తిరుగుతున్న రామచంద్రను దుండగులు తీవ్రంగా కొట్టారు. అక్కడే పడిపోయి లేవలేనిస్థితిలో ఉన్న ఆయన్ను... మదనపల్లె ప్రాంతీయ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. గతంలో న్యాయమూర్తి రామకృష్ణపైనా దాడి జరిగింది. వైకాపా నాయకులే తనపై దాడి చేశారని అప్పట్లో ఆయన ఆరోపించారు. అనంతరం తనకూ, సోదరునికీ ప్రాణహాని ఉందని పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేశారు.
న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడిపై దుండగుల దాడి - జస్టిస్ రామకృష్ణ సోదరుడిపై దాడి
న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గతంలో రామకృష్ణపై దాడి జరగగా...తనకు తన సోదరుడికి ప్రాణహాని ఉందని పోలీసులు, ఉన్నతాధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు.
జస్టిస్ రామకృష్ణ సోదరుడిపై దుండగుల దాడి
Last Updated : Sep 27, 2020, 9:16 PM IST