చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం తిరుమలరెడ్డి గారి పల్లిలో ఫైర్‌మెన్ సురేశ్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. పలమనేరులో ఫైర్‌మెన్‌గా పనిచేసే సురేశ్ తన గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తికి కొంత డబ్బిచ్చాడు. తిరిగి డబ్బు చెల్లించలేదని.. కోర్టు ద్వారా శంకర్‌కు నోటీసులు పంపించాడు. దీంతో కోపోద్రిక్తుడైన శంకర్.. కుటుంబసభ్యులతో కలిసి దాడికి పాల్పడ్డాడని సురేశ్ చెప్పాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వ్యక్తిపై దాడి.. ఆర్థిక లావాదేవీల తగాదే కారణం - attack on firemen news
చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం తిరుమలరెడ్డి గారి పల్లిలో ఫైర్‌మెన్‌గా పనిచేసే సురేశ్ అనే వ్యక్తిపై దాడి జరిగింది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఏర్పడిన తగాదానే ఘటనకు కారణమని గాయపడిన వ్యక్తి తెలిపాడు.
దాడిలో గాయపడిన వ్యక్తి