ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాంకేతిక లోపాలు సాకుగా చూపి..'కోటి' కొట్టేశారు - atm frod case latest updates

ఏటీఎం కేంద్రాల్లో నగదు నిల్వలు నిర్వహించే ప్రైవేటు ఏజెన్సీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించింది. ఏకంగా కోటీ 17 లక్షలు స్వాహా చేసిన ఘటన చిత్తూరులో కలకలం సృష్టించింది.

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

By

Published : Nov 3, 2020, 8:49 PM IST

ఏటీఎం కేంద్రాల్లో నగదు నిల్వలు నిర్వహించే ప్రైవేటు ఏజెన్సీ సిబ్బంది చేతివాటం చూపించారు. ఏకంగా కోటీ 17 లక్షలు స్వాహా చేసిన ఘటన చిత్తూరులో కలకలం సృష్టించింది. వివిధ బ్యాంకుల ఏటీఎంలలో నగదు నిర్వహణ సేవలను రైటర్ బిజినెస్ సర్వీస్ లిమిటెడ్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థ పరిధిలో 110 ఏటీఎం కేంద్రాలు, 76 క్యాష్ పికప్ పాయింట్లు ఉన్నాయి. వీటిని పది రూట్లకు విభజించి పలమనేరుకు చెందిన మహేశ్​ను రూట్ లీడర్​గా పెట్టారు.

ఇతనితో పాటు నవీన్​కుమార్, జ్ఞానశేఖర్ రావు, ఉదయ్ కుమార్, కిశోర్ కుమార్, సురేశ్ కుమార్, అరుళ్​రాజ్, జ్యోతికిరణ్, సంతోష్ కుమార్ ఒక్కొ రూటుకు కస్టోడియన్లుగా ఉన్నారు. వీరు జల్సాలకు అలవాటు పడి ఏటీఎం యంత్రాల్లో నగదు కాజేస్తూ వచ్చారు. సాంకేతిక లోపాలను సాకుగా చూపిస్తూ ఏకంగా కోటీ 17 లక్షలు కాజేశారు. బ్యాంకుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ఏడుగురిని అరెస్టు చేసి 39.4 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

ఇదీచదవండి

రాష్ట్రంలో తొలిసారి తిరుపతిలో పోస్ట్​ కొవిడ్​ ఓపీ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details