ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'న్యాయవ్యవస్థ' తీరుపై ప్రజా చర్చ అవసరం - assembly speaker visited srikalahasthi

న్యాయవ్యవస్థ తీరుపై దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చర్చ జరగాల్సిన అవసరం ఎంతో ఉందని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం కల్పించిన శాసన, పరిపాలన, న్యాయవ్యవస్థలతో పాటు పత్రిక వ్యవస్థ కంటే పౌర వ్యవస్థ ఎంతో బలమైందని అన్నారు.

assembly speaker visited chittoor district
'న్యాయవ్యవస్థ' తీరుపై ప్రజా చర్చ అవసరం

By

Published : Jul 5, 2020, 8:04 AM IST

న్యాయవ్యవస్థ తీరుపై దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చర్చ జరగాల్సిన అవసరం ఎంతో ఉందని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మాట్లాడిన ఆయన.. న్యాయవ్యవస్థల పనితీరుపై ఓ పౌరుడిగా, శాసనసభ్యుడిగా, సభాపతిగా నిష్పక్షపాతంగా అభిప్రాయాన్ని తెలియజేసినట్లు చెప్పారు. దీనిపై విమర్శలు చేయడం కాకుండా అన్ని పార్టీల ప్రతినిధులు సహేతుకంగా ఆలోచించాలని కోరారు.

రాజ్యాంగం కల్పించిన శాసన, పరిపాలన, న్యాయవ్యవస్థలతో పాటు పత్రిక వ్యవస్థ కంటే పౌర వ్యవస్థ ఎంతో బలమైందని సీతారాం అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి సంరక్షణకు ఈ విషయమై లోతైన చర్చలు అవసరమని పేర్కొన్నారు. పార్టీ టికెట్​తో గెలిచిన వ్యక్తులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశం ఉందని, అది వారి వ్యక్తిగతమని, ఇమడలేని పరిస్థితి ఏర్పడినప్పుడు వెళ్లిపోవచ్చని ఎంపీ రఘురామకృష్ణరాజును ఉద్ధేశించి తమ్మినేని వ్యాఖ్యానించారు. సీఎం దయతో తనకు స్పీకర్ పదవి వచ్చిందని చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details