చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని నల్లగంగమ్మ ఆలయంలో అశ్వర్థ నారాయణ( రావి, వేప చెట్లకు)కళ్యాణం వేడుకగా జరిగింది. రావి చెట్టును స్వామివారిగా, వేప చెట్టును అమ్మవారిగా అలంకరించి వేద పండితుల మధ్య కళ్యాణం నిర్వహించారు . ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేపట్టారు. భక్తులందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు.
వేడుకగా అశ్వర్థ నారాయణ కళ్యాణం - శ్రీకాళహస్తిలోని నల్లగంగమ్మ ఆలయంలో అశ్వర్థ నారాయణ కళ్యాణం
శ్రీకాళహస్తిలోని నల్లగంగమ్మ ఆలయంలో అశ్వర్థ నారాయణ స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి కళ్యాణ తంతు నిర్వహించారు.
వేడుకగా అశ్వర్థ నారాయణ కళ్యాణం