ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాడిని నిరసిస్తూ ఆశా కార్యకర్తల ఆందోళన

కరోనా బాధితురాలి ఇంటి ముందు బ్లీచింగ్ చల్లారనే కారణంతో ఆశా కార్యకర్తపై దాడి చేయడాన్ని నిరసిస్తూ.. ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాడి ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

asha workers protest
asha workers protest

By

Published : May 25, 2021, 4:48 PM IST

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం పాలెంపల్లి తండాలో కరోనా రోగి ఇంటి ముందు బ్లీచింగ్ చల్లారని ఆశావర్కర్​పై దాడి చేయటాన్ని నిరసిస్తూ పుంగనూరులో ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

పాలెంపల్లి తండాలో శ్రీరాములు నాయక్ అనే వ్యక్తి చెన్నమ్మ అనే ఆశా కార్యకర్తపై చెప్పుతో దాడికి దిగాడని వారు చెబుతున్నారు. శ్రీరాములు నాయక్ కుమార్తెకు కరోనా సోకిందనే సమాచారంతో ఏఎన్ఎం ఆదేశాల మేరకు మందులు ఇచ్చి..హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచించానని.. ఇంటి ముందు పారిశుద్ధ్య కార్మికులతో బ్లీచింగ్ చల్లించినందుకు రోగి తండ్రి ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని చెన్నమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:ఆనందయ్య ఔషధంపై రెండో రోజు కొనసాగుతున్న పరిశోధన

ABOUT THE AUTHOR

...view details