చిత్తూరు జిల్లా కుప్పంలోఅన్నా క్యాంటీన్ ధ్వంసం సంఘటనకు సంబంధించి తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. ఆ సందర్బంగా జరిగిన లాఠీచార్జీ తదితర సంఘటనల్లో మరో మూడు కేసులు నమోదయ్యాయి. కుప్పం నియోజకవర్గంలో తెదేపా నేతల అరెస్టుల పర్వం మెుదలైంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలపై పోలీసులు పలు కేసులు నమోదుచేసి అరెస్ట్‌లు ప్రారంభించారు. రామకుప్పం మండలం కల్లుపల్లిలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి మాజీ శాసనమండలి సభ్యుడు గౌనిగాని శ్రీనివాసులతో పాటు పలువురు మాజీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ముద్దాయిలుగా చేర్చారు. ఈ కేసుల్లో గౌనిగాని శ్రీనివాసు, మణి, జాకీర్‌లను అరెస్ట్ చేశారు. చంద్రబాబు మూడు రోజుల పర్యటన ముగించుకుని వెళ్లిన వెంటనే అరెస్ట్‌లు ప్రారంభమవ్వడంపై తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కుప్పంలో మెుదలైన అరెస్ట్‌ల పర్వం - latest news kuppam
రెండు మూడురోజులుగా కుప్పం రాజకీయాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. చంద్రబాబుని అడ్డుకోవడంతో మెుదలై, తెదేపా నాయకులపై దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అన్నా క్యాంటీన్ ధ్వంసం అనంతరం చంద్రబాబు పాదయాత్ర, తర్వాతి పరిణామాలు అన్ని తెదేపా కార్యకర్తలు, నాయకులపై పోలీసు కేసులు ప్రారంభమయ్యాయి. దాంతో మళ్లీ ఆ ప్రాంతంలో ఘర్షణలు చలరేగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.
కుప్పంలో మెుదలైన అరెస్ట్‌ల పర్వం