తిరుపతి అవినీతి నిరోధక శాఖలో జరిగిన అవినీతి ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగిని.. డిపార్ట్మెంట్కు సంబంధించిన నగదు గోల్‌మాల్‌కు పాల్పడుతున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. గడిచిన మూడేళ్లుగా.... ఏసీబీ రహస్య సర్వీసుల రివార్డులకు సంబంధించిన ఖాతాలో రూ.పది లక్షలను దశలవారీగా ఉపసంహరించుకున్నారు. చెక్‌లపై నగదుకు సంబంధించిన సంఖ్యలను మార్చుతూ అవినీతికి పాల్పడ్డారు. ఈ అంశంపై ఏసీబీ అధికారులు ఎమ్.ఆర్.పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలుసులు నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు విచారణలో ఆమె.. తన నేరాన్ని అంగీకరించిందని అధికారులు తెలిపారు.
అనిశా కార్యాలయంలో అవినీతి.. నిందితురాలి అరెస్టు - తిరుపతి నేర వార్తలు
తిరుపతి అనిశా కార్యాలయంలో జరిగిన అవినీతి ఘటనలో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. శాఖకు సంబంధించిన నగదును ఆమె ఉపసంహరించుకొని అక్రమానికి పాల్పడిందని ఉన్నతాధికారులు తెలిపారు.
అవినీతి కేసులో నిందితురాలి అరెస్టు
Last Updated : May 31, 2020, 12:35 PM IST