చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. నాగపట్ల వెస్ట్ బీట్ చీకిమానుకోన వద్ద 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లును అరెస్ట్ చేశారు. కూలీలకు నగదు అందిస్తూ స్మగ్లింగ్ సహకరిస్తున్న నిందితుడు హరిబాబు.. త్రుటిలో తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. స్మగ్లర్ల నుంచి రూ. 3 లక్షల విలువైన ఎనిమిది ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు రెండు నాటు తుపాకులు, నిత్యావసర వస్తువుల స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న హరిబాబు కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ - arrest 8 red sandalwood smugglers at seshachalam forest
చిత్తూరు జిల్లా శేషాచల అటవీ ప్రాంతంలో ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 3 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
![శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ arrest 8 red sandalwood smugglers at seshachalam forest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:22:34:1621864354-ap-tpt-36-24-errachandanam-smaglars-naatu-tupakulu-swadhinam-av-ap10100-24052021192122-2405f-1621864282-599.jpg)
శేషాచల అటవీ ప్రాంతంలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్