చుట్టు పక్కల సుమారు 30 కి.మీ. దూరం నుంచే క్షేత్ర ప్రాభవం కన్పించేలా శ్రీకాళహస్తిలో శివపార్వతుల విగ్రహాల ఏర్పాటు పనులు రెండేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. రూ.2.70 కోట్లు వ్యయంతో 52 అడుగుల మేర విగ్రహాల ఏర్పాటుకు నిర్ణయించారు. పీఠం 18 అడుగులు కాగా, మరో 34 అడుగుల ఎత్తులో ఆది దంపతుల ప్రతిమల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
కైలాసగిరుల్లో ఈ ఏర్పాటు పనులు ఆది నుంచీ నత్తనడకన సాగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరిలో పనులు నిలిపివేశారు. తర్వాత కరోనా కారణంగా కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. 4 నెలల తర్వాత.. ఇటీవలే మూడ్రోజుల క్రితం పనులను మరోసారి అధికారులు ప్రారంభించారు.