ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జంట హత్య కేసు: నిందితులను రుయాకు తరలించేందుకు ఏర్పాట్లు - manapalle murders accused news

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన.. చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల నిందితులను తిరుపతికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. న్యాయమూర్తి అనుమతితో నిందితులిద్దరినీ సైకియాట్రీ విభాగానికి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

accused shifting arrangements
నిందితులను రుయాకు తరలించేందుకు ఏర్పాట్లు

By

Published : Jan 28, 2021, 10:42 AM IST

మూఢ నమ్మకాలతో ఇద్దరు కుమార్తెలను దారుణంగా హత్య చేసిన పురుషోత్తంనాయుడు, పద్మజలను... మదనపల్లె సబ్​ జైలు నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిందితుల మానసిక పరిస్థితి పై బుధవారం మదనపల్లె సబ్ జైలు అధికారులు వైద్య పరీక్షలు చేయించగా... వారిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రిలోని సైకియాట్రీ విభాగానికి తరలించాలని వైద్యులు సూచించారు.

భద్రత కోసం ఏఆర్ సిబ్బంది కి సబ్ జైలు అధికారులు లేఖ రాయగా .. కాసేపటి క్రితం ఏఆర్ బృందం మదనపల్లె కి చేరుకుంది. న్యాయమూర్తి అనుమతితో నేడు నిందితులు పురుషోత్తం, పద్మజలను తిరుపతి రుయాకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details