చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలపై తిరుపతి జేఈఓ బసంత్ కుమార్ అధికారులతో సమావేశమయ్యారు. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అనంతరం బ్రహ్మోత్సవం పోస్టర్లను, బుక్ లెట్లను ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాలు ఈనెల 14న ధ్వజారోహణంతో ప్రారంభమై 22న ధ్వజావరోహణంతో ముగియనున్నాయి.
కళ్యాణ వెంకటేశుని బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈవో సమీక్ష - వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలపై ఏర్పాట్లు
చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 14న ప్రారంభం కానున్నాయి. తిరుపతి జేఈఓ బసంత్ కుమార్ అధికారులతో సమావేశమై.. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలపై ఏర్పాట్లు