ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ఏర్పాట్లను కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పరిశీలించారు. ఇందుకోసం ఊరందూరు సమీపంలో సిద్ధం చేసిన 160 ఎకరాల్లో వేసిన లేఅవుట్లను పరిశీలించారు.
జిల్లావ్యాప్తంగా 2.60 లక్షల మందికి ఇళ్ల పట్టాలు
ఈ నెల 28న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సీఎం జగన్ పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పనులను కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమానికి సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని 16 వేల మంది లబ్ధిదారులు సభా ప్రాంగణానికి హాజరవుతారని కలెక్టర్, అధికారులు తెలిపారు. హెలిప్యాడ్, రోడ్లు, సభా స్థలం, పార్కింగ్, సీఎం ప్రారంభించనున్న పైలాన్ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లావ్యాప్తంగా 1850 ఎకరాల్లో రెండు లక్షల 60 వేల మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ధర్మవరంలో యువతి దారుణ హత్య..పోలీసుల అదుపులో యువకుడు