శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేటి నుంచి నామపత్రాలను అధికారులు స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ 12వ తేదీ వరకు జరగనుంది. ఈ క్రమంలో శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, రేణిగుంట.. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. అభ్యర్థులు, మద్దతుదారులను మాత్రమే కేంద్రాల్లోకి అనుమతించే దిశగా చర్యలు తీసుకున్నారు.
శ్రీకాళహస్తిలో నాలుగో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం... - చిత్తూరు జిల్లా ఎన్నికల వార్తలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. నేటి నుంచి నామపత్రాలను అధికారులు స్వీకరించనున్నారు.
శ్రీకాళహస్తిలో నాలుగో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం