ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తీశ్వరాలయం ముస్తాబు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 6 నుంచి పది రోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

MahaShivaratri Brahmotsavam at Srikalahasti Temple
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

By

Published : Mar 2, 2021, 5:28 PM IST

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయం.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 6 నుంచి పది రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవాలకు సంబంధించి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ శిఖరాలతో పాటు మాడవీధుల్లో విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టారు. ఆలయాన్ని రంగవల్లులతో ముస్తాబుచేశారు. స్వామిఅమ్మవార్లు ఉత్సవ వాహనాలను సిద్ధం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ధూర్జటి కళా ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details