జులై 7, 8 తేదీల్లో ముఖ్యమంత్రి జగన్(cm jagan).. కడప జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పులివెందుల శివార్లలోని బాకరాపురం హెలిప్యాడ్, బహిరంగ సభ ప్రాంగణంలో ఏర్పాట్లను అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేసిన ఆయన.. త్వరితగతిన పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రెండు రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి.. దాదాపు రూ.150 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంఖుస్థాపనలు చేయనున్నారు.
అయితే ముఖ్యమంత్రి పర్యటనకు(cm jagan kadapa tour) సంబంధించిన పూర్తి షెడ్యూలు అధికారికంగా రావాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా కొవిడ్-19 స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్(SOP) తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ కృష్ణారెడ్డి, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.