తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికను పటిష్ఠంగా నిర్వహించాలని అదనపు ఎస్పీ రిశాంత్ రెడ్డి అన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాల ఆవరణంలో ఎన్నికల సిబ్బందికి సామగ్రిని అందించారు. అనంతరం సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా కారణంగా అదనంగా 73 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో, మొత్తం 362 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఏర్పాట్లు పూర్తి - తిరుపతి పార్లమెంట్ ఎన్నికలు
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. ఎన్నికల క్రతువులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఏర్పాట్లు పూర్తి
మరోవైపు.. నాయుడుపేట ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల సిబ్బందికి అవసరమైన సామగ్రిని అధికారులు పంపిణీ చేశారు. ఉప ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇవీచదవండి.