మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయం ముస్తాబైంది. విద్యుత్ దీపాలంకరణలతో పాటు, వివిధ పుష్పాలు, ఫలాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులందరికీ దర్శనం కల్పించాలనే లక్ష్యంతో మహాలఘు దర్శనం అమలు చేశారు. సర్వదర్శనం, ప్రత్యేక దర్శనాలకు వేరువేరుగా క్యూ లైన్లు, ప్రసాదాల పంపిణీకి వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.
సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీకాళహస్తీశ్వరాలయం
మహాశివరాత్రి పండుగకు ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తి సిద్ధమైంది. విద్యుత్ దీపాలంకరణలతో పాటు, వివిధ పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.
సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీకాళహస్తీశ్వరాలయం