ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీకట్లు నింపిన దీపావళి.. మంచు చరియలు పడి జవాను మృతి - army jawan died in himachalpradesh

చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ జవాను విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. మంచు చరియలు విరిగిపడడమే దీనికి కారణమని సైనికాధికారులు తెలిపారు.

మంచు చరియలు పడి జవాను మృతి
మంచు చరియలు పడి జవాను మృతి

By

Published : Nov 6, 2021, 9:19 AM IST

Updated : Nov 6, 2021, 9:41 AM IST

దేశ ప్రజల ముఖాల్లో వెలుగు చూడాలని ఆ జవాన్‌ తాపత్రయం.. దేశ ప్రజలకు వెలుగులు పంచుతూ దీపావళి రోజే ప్రకృతి ప్రకోపానికి బలి కావడంతో ఆ కుటుంబంలో చీకట్లు అలముకున్నాయి. ఎప్పుడు దేశ సేవ కోరేవాడని, ఆ క్రమంలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని సైనికుడిగా చేరి విధులు నిర్వహిస్తుండగానే అసువులు బాశారు ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ బంగారువాండ్లపల్లెకు చెందిన పెద్దావుల కార్తిక్‌కుమార్‌రెడ్డి(29). గురువారం సాయంత్రం హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం మనాలి సమీపంలో మంచుకొండలు విరిగి పడిన ఘటనలో కార్తిక్‌ మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదం అలముకుంది. బంధుమిత్రులు ఆయన ఇంటి వద్ద గుమికూడారు. కార్తిక్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జాతీయ రహదారి పక్కన ఆయన చిత్రపటం ఏర్పాటు చేసి నివాళులర్పించారు.


రైతు బిడ్డ..

నారాయణరెడ్డి, సరోజమ్మ దంపతులకు కార్తిక్‌కుమార్‌రెడ్డి, క్రాంతికుమార్‌రెడ్డి ఇద్దరు కుమారులు. తండ్రి ఏడాది కిందట అనారోగ్యంతో మరణించాడు. భర్త మృతి చెందినా ఇద్దరు కుమారులను చూసుకొని సరోజమ్మ కాలం గడుపుతున్నారు. ఈ ఏడాది మేలో అన్నయ్య వివాహానికి హాజరయ్యారు. కార్తిక్‌కుమార్‌రెడ్డి మరణించాడన్నా విషయం శుక్రవారం సాయంత్రం వరకు బంధువులు ఆమెకు తెలియనివ్వలేదు.

బాల్యం నుంచే అదే ఆకాంక్ష..

కార్తిక్‌కుమార్‌రెడ్డి చిన్నప్పటి నుంచే సైన్యంలో చేరాలని మక్కువ పెంచుకున్నారు. ఈ క్రమంలోనే చక్కగా చదువుకోవాలని, తాను ఎంచుకున్న లక్ష్యంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. 2011లో సైన్యంలో (ఎంఈజీలో) చేరారు. ముంబయిలో సెయిలింగ్‌(పడవ నడపడం)లో ఉత్తమ ప్రతిభ చూపి పతకం పొందారు. మొదట జమ్మూకశ్మీర్‌లో, ఆ తర్వాత ముంబయిలో పనిచేశారు.


ఆ మాటలే చివరివి..
దీపావళి పండుగ రోజున ఉదయం తుదిసారి తల్లి సరోజమ్మతో కార్తిక్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. అమ్మా బాగున్నావా.. కుటుంబంలో అందరూ బాగున్నారా.. అంటూ మాట్లాడిన మాటలే చివరివి.


అన్న వివాహంలో కుటుంబ సభ్యులతో..

ఇదీ చదవండి:

బుల్లెట్‌తో ఢీకొట్టి.. పత్రాలు లాక్కెళ్లి

Last Updated : Nov 6, 2021, 9:41 AM IST

ABOUT THE AUTHOR

...view details