ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ అరణ్య చిత్రాన్ని వీక్షించాలి'

తిరుపతిలోని జయశ్యామ్ థియేటర్​లో అరణ్య చిత్రం ప్రీ-రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల క్యూరేటర్ హిమ శైలజ పాల్గొన్నారు. అటవీ జంతువుల పరిరక్షణపై అవగాహన పెంపొందించేలా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని ఆమె కోరారు.

aranya pre release event in jayashyam theater in thirupathi
శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల క్యూరేటర్ హిమశైలజ

By

Published : Mar 20, 2021, 9:59 PM IST

అటవీ జంతువుల పరిరక్షణపై అవగాహన పెంపొందించేలా రూపొందిన అరణ్య చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని అటవీశాఖ అధికారులు కోరారు. తిరుపతి జయశ్యామ్ థియేటర్​లో నిర్వహించిన అరణ్య చిత్రం ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల క్యూరేటర్ హిమశైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మానవ తప్పిదాల కారణంగానే ఏనుగులు ఊళ్లలోకి వస్తున్నాయని హిమ శైలజ చెప్పారు. చిత్రంలో ప్రముఖ నటుడు రానా నటిచండం వల్ల వన్యప్రాణులను కాపాడుకోవాలనే సందేశం ప్రజల్లోకి తొందరగా వెళ్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సందేశాత్మకమైన ఈ చిత్రాన్ని ప్రజలకు చేరువచేసేందుకు ప్రభుత్వం తరఫున ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details