చిత్తూరు నగరంలో ఓ వ్యాపారి వ్యానులో పెట్టిన దుస్తులను చోరీ చేస్తూ ఇటీవల దొరికిపోయిన.. ఏఆర్ ఎస్సై మహమ్మద్ మృతి చెందాడు. నాలుగు రోజుల కిందట కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఒక కానిస్టేబుల్‌తో కలిసి దుస్తులు దొంగతనం చేసిన ఘటనలో.. సీసీ పుటేజీ ఆధారంగా మహమ్మద్‌ను పోలీసు శాఖ ఉన్నతాధికారులు విధులు నుంచి తాత్కాలికంగా తొలగించారు.
అనంతరం ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సస్పెన్షన్‌కు సంబంధించిన ఉత్తర్వులు బుధవారం ఆయనకు అందడంతో.. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇవాళ ఉదయం మహమ్మద్ వాంతులు చేసుకోగా..జైలు అధికారులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సదరు అధికారి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే..
చిత్తూరులో వస్త్రాలు విక్రయించే స్థలంలో ఏఆర్ ఎస్సై, కానిస్టేబుల్ చోరీకి పాల్పడ్డారు. రెండ్రోజుల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పీవీకేఎన్ కళాశాల నుంచి కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో.. ఓ వ్యక్తి బట్టల వ్యాపారాన్ని ప్రారంభించాడు. వ్యానులో దుస్తులు ఉంచి విక్రయింస్తుంటాడు. రాత్రి దుకాణం మూసి బట్టలన్నీ మూట కట్టి తరువాత రోజు పొద్దున్నే యథావిథిగా వచ్చాడు. చూసేసరికి బట్టలు తక్కువుగా ఉండడాన్ని గుర్తించాడు.
ఎవరికీ తెలియకుండా అమర్చిన సీసీ కెమేరా ఫుటేజీ చూసేసరికి యూనిఫాంలో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్ కాజేసినట్లు గుర్తించాడు. ఆ ఫుటేజీని పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై స్పందించిన ఎస్పీ సెంథిల్‌కుమార్.. వస్త్రాల చోరీకి పాల్పడిన ఎస్సై మహమ్మద్, కానిస్టేబుల్ ఇంతియాజ్‌ను అరెస్ట్ చేశారు. విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
ఇదీ చదవండి:
విషపూరితమైన ఆహారం తిని ఐదు నెమళ్లు మృతి..!