ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వరహాలనాయుడు కన్నుమూశారు. ఈ నెల 18న గుంటూరు వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వరహాలనాయుడు... ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఐకాసలో కో-కన్వీనర్, ఏపీ అమరావతి ఐకాసలో ఆర్గనైజింగ్ కార్యదర్శిగా వరహాలనాయుడు పదవులు నిర్వహించారు.
ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్నుమూత - news on apsrtc
ఏపీఎస్ఆర్టీసీ కార్మికపరిషత్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి.వరహాలనాయుడు మృతిచెందారు. ఈనెల 18 న గుంటూరు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన వరహాల నాయుడు. . ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఈ రోజు తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. చిత్తూరు జల్లా ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
ఏపీఎస్‌ఆర్టీసీ కార్మిక పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్నుమూత
ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు వరహాలనాయుడు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరహాలనాయుడు మృతి పట్ల ఆర్టీసీ కార్మిక పరిషత్ నేతలు సంతాపం తెలిపారు. ఆర్టీసీ కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన వరహాల నాయుడు మృతి బాధాకరమని ఆర్టీసీ ఈయూ రాష్ట్ర కమిటీ విచారం వ్యక్తం చేసింది. చిత్తూరు జల్లా ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇదీ చదవండి : కార్మికులకు ఇది కష్టకాలం- సర్కారే ఆదుకోవాలి
TAGGED:
news on apsrtc