చినపాండూరు ప్లాంట్ నుంచి అపోలో తొలి టైర్ విడుదల - latest news of chinapandoor apollo plant
చిత్తూరు జిల్లా చినపాండూరులోని ప్లాంట్‌లో తయారైన తొలి టైరును అపోలో టైర్స్ సంస్థ విడుదల చేసింది. 2022నాటికి రోజుకు 15వేల కారు టైర్ల ఉత్పత్తే లక్ష్యమని తెలిపింది.
చిత్తూరు జిల్లా చినపాండూరులో ఉత్పత్తి ప్రారంభించిన అపోలో టైర్స్ సంస్థ... తొలి టైర్‌ను విడుదల చేసింది. గురువారం వర్చువల్ సమావేశం ద్వారా... అపోలో టైర్స్ ఛైర్మన్ ఓంకార్ ఎస్.కన్వర్ తొలి టైర్ విడుదల చేశారు. 3 వేల 800 కోట్ల రూపాయల తొలిదశ పెట్టుబడులతో 2018లో ఏర్పాటైన ఈ సంస్థకు అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2022నాటికి రోజుకు 15వేల కారు టైర్లు, 3వేల బస్సు, ట్రక్కు టైర్ల ఉత్పత్తే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని.. నైపుణ్యమున్న స్థానిక యువతను ఉత్పత్తిలో భాగస్వామ్యం చేస్తున్నామని ఛైర్మన్ ఓంకార్ తెలిపారు.