ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత విడగొడతారని భయంతో ఈ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారా యువతీయువకుడు. విడిపోయి బతకలేమంటూ ఓ ఆఖరి సందేశాన్ని కన్నవారికి పంపించారు. క్షమించమని వేడుకున్నారు.
ప్రేమ జంట ఆత్మహత్య
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మెురవపల్లి సమీపంలోని రైల్వేపట్టాలపై ఓ యువ జంట పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. వీళ్లిద్దరు ఎవరై ఉంటారని ఆరా తీసిన పోలీసులకు... అక్కడో మొబైల్ దొరికింది. ఘటనా స్థలంలో దొరికిన మొబైల్ పరిశీలించిన పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. ఫోన్‌లో కొన్ని స్వీయ చిత్రాలు, వీడియోలు చూశారు. వాటిని పరిశీలిస్తే అసలు వాస్తవాలు వెలుగు చూశాయి.
20 ఏళ్ల నిండకుండానే ప్రేమ, పెళ్లి
శ్రీకాళహస్తి పట్టణం వరదరాజుల గుడివీధికి చెందిన పల్లవి (16) శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతోంది. చంద్రగిరి మండలం కాశిపెంట్ల పంచాయతీ మొరవపల్లి ఆధి ఆంధ్రవాడకు చెందిన ధనుంజయ (20)తో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమేర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. ప్రేమ విషయం తెలిసిన పెద్దలు ఇద్దర్నీ మందలించారు. పెళ్లికి ససేమిరా అన్నారు.
తొందరపాటు నిర్ణయం
ఇంతలో ఇంటర్ ఫలితాలు రావడం పల్లవి పరీక్షలు తప్పడం జరిగింది. తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. ఆ రోజే ఎవరికీ చెప్పాపెట్టకుండా ధనుంజయ్ దగ్గరు వెళ్లిపోయింది. ఇద్దరూ పెళ్లి చేసేసుకున్నారు. విషయం తెలియక కుమార్తె ఆచూకీ లేక తల్లిదండ్రులు శ్రీకాళహస్తి-1వ పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇంతలో రైలు పెట్టాలపై విగతజీవులై పడి ఉన్నారు.
కుటుంబాలకు సమాచారం
మృతుల వద్ద ఉన్న ఆధారాల మేరకు తొలుత స్థానికులు ధనుంజయ్‌ను గుర్తించారు. ఆపైన అమ్మాయి చిరునామాను గుర్తించి ఇరుకుటుంబాలకు సమాచారం అందించారు. శవపంచనామా నిర్వహించిన తర్వాత మృతదేహాలను తిరుపతిలోని ఎస్వీ వైద్యకళాశాలకు తరలించారు. పాకాల రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చివరి సందేశం
ప్రేమ అంగీకరించి పెళ్లి చేసేందుకు నిరాకరించినందునే చనిపోతున్నట్టు సెల్పీ వీడియో తీసుకున్నారు. వీడిపోలేక కలిసి చనిపోతున్నామని చెబుతూ... అంతా క్షమించాలని వేడుకున్నారా వీడియోలో.