ఆందోళనలు, ధర్నాలతో పరిశ్రమల యాజమాన్యాలను వైకాపా భయపెడుతోంది: మంత్రి అమర్నాథ్ ఆందోళనలు, ధర్నాలతో రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరిమేసేందుకు... వైకాపా కంకణం కట్టుకుందని మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలోని కియా కార్ల పరిశ్రమ ఎదుట వైకాపా నాయకులు ధర్నా చేయడం తగదన్నారు. ఇలా చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని మంత్రి ప్రశ్నించారు. కియాలో 86 శాతం వరకు స్థానికులకే ఉపాధి కల్పించినట్లు తెలిపారు. సాంకేతికంగా అవసరమైన 14 శాతం వరకు సిబ్బందిని మాత్రమే బయటి నుంచి తీసుకున్నట్లు వెల్లడించారు. దీన్ని సైతం ప్రతిపక్ష పార్టీ రాజకీయం చేస్తోందన్నారు.