- మెట్రో రైళ్లకు.. మోక్షం ఎప్పుడు..?
మెట్రో రైళ్లకు.. రాష్ట్రంలో ఎర్రజెండా పడింది. వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడున్నరేళ్లు దాటుతున్నా.. కనీసం ఊసే ఎత్తడం లేదు. విభజన చట్టంలో మెట్రో గురించి ఉన్నా సాధించుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. కనీసం కేంద్రానికి ప్రతిపాదనలూ పంపని పరిస్థితి. ఏపీ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్రం ఇటీవల పార్లమెంట్ వేదికగా తెలిపింది. అయినప్పటికీ ఎలాంటి చలనం లేదు. ఇప్పటివరకూ ఒకటి రెండు సమీక్షలతోనే సీఎం జగన్ సరిపెట్టేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాధితులైన తెలుగుదేశం నేతలనే.. నిందితులుగా చేర్చారు..!
చంపేందుకు వచ్చిన వారిపై హత్యాయత్నం కేసుల్లేవు..! ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితులపై రివర్స్ కేసులు..! తెలుగుదేశం నేతలైతే రెండేసి కేసులు.. వైసీపీ వర్గీయులైతే బెయిలబుల్ సెక్షన్లతోనే సరి. గుడివాడ ఘర్షణకు సంబంధించి పోలీసులు ఉపయోగిస్తున్న ఫార్ములా ఇది. బొమ్మను తిమ్మి చేసి.. తిమ్మిని బొమ్మ చేసి, ఉల్టా కేసులు పెడుతున్న పోలీసుల తీరు విస్మయం కలిగిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జగనన్న లే అవుట్ కోసం...జీవనాధారమైన భూములు పోగొట్టుకున్న రైతులు
జగనన్న లేఅవుట్ కోసమని... రైతుల నుంచి భూములు సేకరించారు. ఎకరాకు రూ. 25 లక్షల పరిహారం ఇస్తామని చెప్పడంతో కష్టాలు తీరుతాయని రైతులు సంబరపడ్డారు. తీరా భూములు తీసుకున్నాక సగం మందికే పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఎన్ని సార్లు స్పందన కార్యక్రమంలో మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాక అన్నదాతలు అల్లాడుతున్నారు. ఈ ఘటన జగనన్న నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం కొమ్మరపూడిలో ప్రభుత్వం భూసేకరణ జరిపింది. కొత్తూరు బిట్ వన్‌లోని 122 మంది ఎస్సీ రైతుల నుంచి 62 ఎకరాల పొలం తీసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రూరల్ సబ్‌రిజిస్ట్రార్ శ్యామలాదేవిపై బదిలీ వేటు..
ఈనాడు-ఈటీవీ వరుస కథనాలతో రాయచోటిలో ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పై జిల్లా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ప్రకంపనలు సృష్టించిన ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పై ఉన్నతాధికారులు కొరఢా ఝులిపించారు. 120 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఇక రికార్డుల పరంగా 13 ఎకరాలు యథాతథంగా ప్రభుత్వ భూమిగానే కొనసాగనుందని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కర్ణాటకలో మరో పేలుడు.. కొరియర్ షాపులో మిక్సీ పేలి..
కర్ణాటకలో మరో పేలుడు ఘటన కలకలం సృష్టించింది. హసన్ జిల్లాలో ఓ కొరియర్ షాపులో ఉన్న మిక్సీ పేలి యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. మిక్సీని మరో చోటికి రవాణా చేస్తుండగా పేలడం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత జలాల్లో పాక్ పడవ.. రూ.300 కోట్ల డ్రగ్స్, గన్స్‌తో అనుమానాస్పదంగా..
ఆయుధాలు, మాదకద్రవ్యాలతో భారత జలాల్లోకి ప్రవేశించిన పాక్ పడవను కోస్టుగార్డు అధికారులు సీజ్ చేశారు. 10 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. పడవలో 40 కేజీల డ్రగ్స్ దొరికాయని అధికారులు తెలిపారు. వీటి విలువ రూ.300 కోట్లు ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పారిశ్రామిక దిగ్గజం నుంచి రుణ ఎగవేతదారుగా.. వేణుగోపాల్ ధూత్ అధోగతి ఇలా
ఒకప్పుడు దేశంలోనే గొప్ప పారిశ్రామిక వేత్తల్లో ఒకరిగా నిలిచిన వీడియోకాన్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మోసపూరితంగా రుణం తీసుకొన్న కేసులో ఆయన సోమవారం అరెస్ట్ అయ్యారు. వీడియోకాన్ గ్రూపును వివిధ రంగాల్లో విస్తరించడంలో కీలక పాత్ర పోషించిన వేణుగోపాల్ రుణ ఎగవేతదారుగా ఎలా మారారో తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నడిపించింది వాళ్లిద్దరే : సూర్య కుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్.. తన 360 డిగ్రీల ఆటతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు.అతడు బ్యాటింగ్ చేస్తుంటే ఆ బంతి ఏ మూల తేలుతుందో అని వెతకాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంతటి అద్భుత ఆటతీరు ఉన్న సూర్యకుమార్ యాదవ్ ప్రపంచకప్ ప్రణాళికలు తదితర విషయాలపై మాట్లాడాడు అవి ఏంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ప్రేమ'కు జై కొట్టారు.. 2022లో హిట్టైన లవ్ స్టోరీలు
ప్రేమ లేని సినిమాలు అరుదు. ఊర మాస్, ఫాంటసీ, థ్రిల్లర్.. కథా నేపథ్యం ఏదైనా.. అందులో ఎక్కడో ఒక చోట ప్రేమకి చోటిస్తుంటారు. అందులో నుంచే వాణిజ్యాంశాల్ని సృష్టిస్తుంటారు. అలా కాకుండా.. కేవలం ప్రణయం చుట్టూనే సాగే కథలు కొన్ని వస్తుంటాయి. ఓ అబ్బాయి, ఓ అమ్మాయి.. వాళ్ల మధ్య ప్రేమ, ఎదురయ్యే సవాళ్లుగా సాగే కథలు. ఇలాంటివి నలుపు తెలుపుల కాలం మొదలుకొని ఇప్పటికీ తెరపైకి వస్తూనే ఉన్నాయి. అయినా ఎప్పటికప్పుడు కొత్త రకమైన అనుభూతిని పంచుతుంటాయి. ప్రేమ నిత్య నూతనం అనడానికి తార్కాణం అదే. ఈ ఏడాది కూడా తెలుగు తెరపైకి బోలెడు రకాల కథలొచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.