ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP TOPNEWS ప్రధానవార్తలు@7am

..

7am topnews
ప్రధానవార్తలు7am

By

Published : Dec 24, 2022, 6:58 AM IST

  • ఒక్కో రైతుపై రూ.2.45 లక్షల అప్పు.. దేశంలో ఏపీనే టాప్​​..!
    రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబంపై 2 లక్షల 45 వేల అప్పుల భారం ఉంది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది మూడింతలు అధికం. సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఒక్కో రైతు కుటుంబం లక్షా 52వేల రుణభారంతో.. దేశంలో ఐదో స్థానంలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని సీఎం.. 3 రాజధానులు కడతారా?: చంద్రబాబు
    విజయనగరం జిల్లా బొబ్బిలి బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో యువతను జగన్​మోహన్ రెడ్డి మోసగించారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది తమ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. జీతాలు సైతం ఇవ్వలేని సీఎం 3 రాజధానులు కడతారా? అంటూ ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దివికేగిన నవరస నటనా సార్వభౌముడు.. సంతాపం తెలిపిన రాజకీయ ప్రముఖులు
    నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణకు రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు. ప్రధాని, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు సహా.. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు దివంగత నటుడి మృతికి సంతాపం తెలిపి, కుటుంబసభ్యులను ఓదార్చారు. అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'కరోనా కొత్త వేరియంట్​ భారతీయులపై పెద్దగా ప్రభావం చూపదు'
    ఒమిక్రాన్​ కొత్త రూపాంతరం బీఎఫ్​-7 భారతీయులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. కొవిడ్ వ్యాక్సిన్​ల పనితీరు బూస్టర్ డోస్​లపై ఏఐజీ నిర్వహించిన సర్వేని వ్యాక్సిన్స్ సైన్స్ జనరల్​లో పబ్లిష్ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఏఐజీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • శబరిమల యాత్రలో విషాదం.. లోయలో పడిన వాహనం.. 8 మంది భక్తులు మృతి
    కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్నఓ వాహనం అదుపుతప్పి లోయలో పడి ఎనిమిది మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఖండాలు దాటిన ప్రేమ ఒక్కటైన నెదర్లాండ్స్​ యువతి బిహార్ యువకుడు
    నెదర్లాండ్స్ యువతిని ఓ బిహార్​ యువకుడు వివాహం చేసుకున్నాడు. హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఫ్రాన్స్​లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి.. మరో ముగ్గురికి గాయాలు..
    ఫ్రాన్స్​లో​ కాల్పులు కలకలం రేపాయి. 69 ఏళ్ల వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ICICI బ్యాంక్​ మాజీ సీఈవో చందా కొచ్చర్ అరెస్ట్.. ఆ కేసులోనే..
    ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్తను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీడియోకాన్‌ గ్రూపునకు సంబంధించిన కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • IPL మినీ వేలం.. అందరి దృష్టి కావ్య పాపపైనే.. ఆమెకు ఎందుకింత క్రేజ్‌?
    ఐపీఎల్‌ మినీవేలం సందర్భంగా కావ్య మారన్‌ మరోసారి సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నారు. అసలు ఎవరీ కావ్య మారన్‌? ఆమెకు ఎందుకింత క్రేజ్‌? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆ వార్తలను ఖండించిన సూర్య సినిమా నిర్మాత.. 10 నిమిషాల్లో ఫేమ్‌ పొందేందుకే..
    తమ సినిమాపై వస్తున్న వదంతులను నమ్మవద్దని నిర్మాత కలైపులి అన్నారు. అసత్యాలను నమ్మొద్దని హీరో సూర్య అభిమానులకు ఆయన కోరారు. అసలేం జరిగిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details