- బడుగు వర్గాలకు భారీ షాక్.. ఉచితం నుంచి 3 లక్షల 93 వేల కనెక్షన్లు తొలగింపు
ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం విద్యుత్ షాక్ ఇచ్చింది. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం నుంచి.. దాదాపు 3 లక్షల 93 వేల కనెక్షన్లు తొలగించింది. జగ్జీవన్ జ్యోతి పథకం నిబంధనల మేరకు అర్హతలున్న వారికీ కోత పెట్టేసింది. ఉచిత విద్యుత్ పథకం నుంచి ప్రభుత్వం తమను ఎందుకు తీసేసిందో తెలియడం లేదని.. కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నామని బాధితులు వాపోతున్నారు.
- నేడు ఖమ్మంలో టీడీపీ శంఖారావం.. పసుపుమయంగా మారిన నగరం
తెలంగాణలోని ఖమ్మం గుమ్మంలో టీడీపీ శంఖారావం బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ బలోపేతంగా లక్ష్యంగా ఇవాళ నిర్వహించే సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. సభను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేస్తున్న టీడీపీ.. లక్ష మందిని తరలించేలా ప్రణాళికలు చేస్తోంది.
- 'కత్తి పట్టినవాడు బాధితుడూ.. దాడులకు గురైన తెలుగుదేశం వాళ్లు నిందితులా..?'
మాచర్ల వైకాపా నేత చల్లా మోహన్ కత్తిపట్టిన వీడియోపై డీజీపీ ఖాకీ డ్రెస్ సిగ్గుపడుతుందంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులపై పెట్టిన కేసులు.. టీడీపీ నేతలపై పెట్టిన కేసులకు వ్యత్యాసాన్ని తెలుపుతూ.. వైసీపీ నేత కత్తి పట్టిన వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేశారు.
- నెల్లూరు జిల్లాలో కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి
నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద.. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి మధ్యలోని.. గ్రీనరీని కట్ చేస్తున్న కార్మికులపైకి లారీ దూసుకెళ్లింది. ఆ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు.
- పనిమనిషిపై యజమాని అత్యాచారం.. తల్లిని చూసుకునేందుకని పిలిచి..
పనిమనిషిపై అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి. వృద్ధురాలైన తన తల్లిని చూసుకోవాలంటూ.. ఓ ఆన్లైన్ ఏజెన్సీని ద్వారా పని మనిషిని నియమించుకున్న ఆ వ్యక్తి.. ఆమెపై అఘయిత్యానికి పాల్పడ్డాడు. జరిగిన దారుణాన్ని బాధిత మహిళ ఏజెన్సీ నిర్వహకులు ఫోన్ చేసి చెప్పింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
- 'పుష్ప' సినిమా స్ఫూర్తితో ఎర్రచందనం స్మగ్లింగ్.. ఏడుగురు అరెస్ట్
యూపీలో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మథుర పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవర్ధన్ రోడ్డులో నిందితులందర్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు. కాగా, పుష్ప సినిమా చూసి ఎర్రచందనం స్లగ్లింగ్కు పాల్పడినట్లు నిందితులు తెలిపారు.
- '10వేల మంది హత్య'.. 97ఏళ్ల మహిళను దోషిగా తేల్చిన కోర్టు.. శిక్ష ఏంటంటే?
జర్మనీలో 10వేలమందినిపైగా హత్యచేసిన కేసులో 97 ఏళ్ల మహిళను కోర్టు దోషిగా తేల్చింది. 1943నుంచి 1945 మధ్యకాలంలో జరిగిన హత్యలకు ఆమెకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్నట్లు నిర్ధరించిన కోర్టు ఈమేరకు శిక్ష విధించింది. విచారణ సమయంలో తన వల్ల తప్పు జరిగినట్లు ఒప్పుకున్న ఆ వృద్ధురాలు... అందుకు క్షమాపణ చెప్పింది.
- IFSC, MICR అంటే ఏంటి? వాటి వల్ల ఉపయోగాలు తెలుసా?
సాధారణంగా బ్యాంకుల ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపినప్పుడు ఐఎఫ్ఎస్సీ, ఎంఐసీఆర్ కోడ్ల గురించి వింటుంటారు. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలు, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి ఎలక్ట్రానిక్ లావాదేవీల్లో ఐఎఫ్ఎస్సీ కోడ్ అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో ఐఎఫ్ఎస్సీ కోడ్ గురించి తెలుసుకుందాం.
- 'బాబర్ పెద్ద గుండు సున్నా... దయచేసి అతడిని విరాట్‌తో పోల్చకండి'.. పాక్ మాజీ ఫైర్
ఇంగ్లాండ్ చేతిలో పాకిస్థాన్‌కు చావుదెబ్బ. వరుసగా మూడో టెస్టులోనూ ఓడిన పాక్.. అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకొంది. దీంతో కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై ఒక్కసారిగా తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ఆ జట్టు మాజీ ఆటగాడు డానిష్ కనేరియా సైతం బాబర్‌పై విమర్శలు గుప్పించారు.
- మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత.. ఆ వార్తల్లో నిజం లేదట
బాలీవుడ్ ప్రాజెక్టుల నుంచి సమంత వైదొలగుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె ప్రతినిధులు తెలిపారు. మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.