ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP TOPNEWS ప్రధానవార్తలు@9am - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

..

9am topnews
ప్రధానవార్తలు9am

By

Published : Dec 20, 2022, 9:01 AM IST

  • అమూల్​కే అన్నీ.. డెయిరీలు వాటి ఆస్తులు
    సహకార డెయిరీలను పునరుద్ధరిస్తామని గొప్పలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆ మాటను తుంగలో తొక్కడమే కాకుండా.. సహకార డెయిరీల విలువైన ఆస్తులను అమూల్‌కు అప్పనంగా కట్టబెట్టేశారు. నడుస్తున్న డెయిరీలనూ మూసివేయించడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. పాడి రైతులకు లీటర్‌కు 4 రూపాయల బోనస్ హామీ ఊసే లేదు కానీ, అమూల్‌ ద్వారా లీటర్‌కు 10 రూపాయలు అధిక ధర ఇప్పిస్తున్నట్లు సొంత డప్పు కొట్టుకుంటున్నారు. అన్నింటిలాగే ఈ హామీలపైనా మడమ తిప్పేసిన జగన్‌.. రాష్ట్రంలోని సహకార డెయిరీలను పక్కకు నెట్టేసి.. గుజరాత్‌కు చెందిన అమూల్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఏపీలో పెరిగిన అప్పులు.. వివరాలు బయటపెట్టిన కేంద్రం
    రాష్ట్రం చేసిన అప్పుల లెక్కల్నే లోక్‌సభ వేదికగా కేంద్రం వెల్లడించింది. బడ్జెట్‌ గణాంకాల ప్రకారం రాష్ట్ర అప్పు 3.98 లక్షల కోట్లని కేంద్రమంత్రి చెప్పారు. అయితే.. ఈ అంకెలేవీ ఖరారైన పబ్లిక్‌ డెట్‌ కానేకాదు. ఎందుకంటే.. అందులో కార్పొరేషన్ల అప్పులు, నాన్‌ గ్యారంటీ రుణాలు, పెండింగ్ బిల్లులు కలపలేదు. ఇవన్నీ కలిపితే... ఏపీ అప్పులు, చెల్లింపుల భారం 8 లక్షల 71 వేల కోట్ల రూపాయలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆర్టీసీ స్థలం వైసీపీకి కేటాయింపు.. రెవెన్యూ శాఖ రహస్య ఉత్తర్వులు
    బాపట్ల నడిబొడ్డున ఉన్న కోట్ల విలువైన రెండెకరాల ఆర్టీసీ స్థలం.. కారుచౌకగా వైసీపీ పరమైంది. ఆర్టీసీ ఉన్నతాధికారులకు తెలియకుండానే.. ఏడాదికి కేవలం వెయ్యి రూపాయల లీజుతో వైసీపీ జిల్లా కార్యాలయానికి కేటాయిస్తూ రెవెన్యూశాఖ రహస్య ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పోలీసులతోపాటు తహసీల్దారుకు ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా.. అదే స్థలంలో వైసీపీ కార్యాలయానికి మంత్రులు శంకుస్థాపన చేయడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • విజయవాడలో మహిళపై సామూహిక అత్యాచారం
    విజయవాడలో దారుణం జరిగింది. కూలి పనులు చేసుకునే మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నలుగురు మానవ మృగాళ్లు మూడు రోజులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హైదరాబాద్​లో భాజపా కీలక సమావేశాలు.. ఆ 160 లోక్​సభ స్థానాల గెలుపే లక్ష్యంగా!
    2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై గురిపెట్టింది భాజపా. మొన్నటి వరకు కష్టమైన లోక్​సభ స్థానాల సంఖ్య 144 ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 160కి చేరింది. ఈ క్రమంలోనే పట్నా, హైదరాబాద్​లలో విస్తారక్​ల సమావేశాలను నిర్వహించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కర్ణాటక ఎన్నికలకు జేడీఎస్ సన్నద్ధం.. టికెట్లు ఖరారు.. కుటుంబానికే ప్రాధాన్యం!
    వచ్చే సంవత్సరం జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. అందులో భాగంగానే జనతా దళ్(సెక్యులర్)​ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 93 మందికి చోటు కల్పించగా.. 32 మంది​ సిట్టింగ్​ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దెబ్బకు ఠా.. చైనా ముఠా.. డ్రాగన్​కు చుక్కలు చూపించిన భారత్​..
    తవాంగ్​లో అక్రమంగా చొరబడి భారత్​ సైన్యానికి భారీ ప్రాణనష్టం కలిగిద్దామని ప్రయత్నించిన చైనా వ్యూహం బెడిసికొట్టింది. డ్రాగన్​ ఎత్తుగడలను ముందుగానే పసిగట్టిన భారత్​ అప్రమత్తమై చైనాకు చుక్కలు చూపించింది. ఈ ఘర్షణకు సంబంధించిన కీలక వివరాలు మిలటరీ ద్వారా బయటకు వచ్చాయి. అవి ఏంటంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారత్​లో ఐఫోన్ల తయారీ మూడింతలు.. 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు!
    ఐఫోన్ల తయారీ కంపెనీ భారత్​లో తన ఉత్పత్తిని మూడింతలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే త్వరలోనే భారత్‌ ఒక ప్రధాన సరఫరా కేంద్రంగా మారగలదని అంచనా. దీంతో దేశీయంగా సరఫరాదార్లు సంఖ్య పెరిగి.. 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఈ శకం అతడిదే..! ఫుట్​బాల్​కు కొత్త సూపర్‌స్టార్‌!
    నిలకడైన ప్రదర్శనతో జట్టును ఫైనల్‌ చేర్చింది అతడు. ఏకపక్షంగా సాగుతున్న ప్రపంచకప్‌ తుదిపోరును ఉత్కంఠగా మార్చింది అతడు. హ్యాట్రిక్‌ గోల్స్‌తో జట్టును పోటీలో నిలిపింది అతడు. మెస్సి కప్పు కలను భగ్నం చేసేలా కనిపించింది అతడు. చివరకు మెస్సి కప్పును ముద్దాడితే.. అతడు అందరి మనసులను గెలిచాడు. ఫైనల్లో విజయం కోసం గొప్పగా పోరాడిన అతడే.. ఫ్రాన్స్‌ సంచలనం కిలియన్‌ ఎంబాపె. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ముద్దుగుమ్మల అందాల విందు.. అలరించిన ఐటెమ్​ సాంగ్స్​!
    సినిమాల్లో ప్రత్యేక గీతానికి ఉన్న స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. సినిమాకి అదనపు ఆకర్షణ జోడించాలన్నా.. కథానాయకులతో మాస్‌ స్టెప్పులు వేయించాలన్నా.. మాస్‌ ప్రేక్షకుల్ని ఊరిస్తూ థియేటర్లకు రప్పించాలన్నా.. దర్శక నిర్మాతలు తొలుత చూసేది స్పెషల్‌ సాంగ్‌ వైపే. హీరో పరిచయ గీతాల్లోనూ లేనంత మజా ఈ పాటల్లో కనిపిస్తుంటుంది. అందుకే ప్రత్యేక గీతాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది తెలుగు చిత్రసీమ. ఎప్పట్లాగే ఈ ఏడాదీ తెలుగులో ఐటెమ్‌ గీతాలు హోరెత్తాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details