ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM - ap top ten news

ఏపీ ప్రధాన వార్తలు

AP TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Nov 8, 2022, 9:01 PM IST

  • ఈనెల 11న ప్రధాని విశాఖ పర్యటన.. కార్యక్రమాలివే..
    Pm Tour In Visakha: ఈ నెల 11న ప్రధాని విశాఖకు రానున్నారు. ఆ రోజు రాత్రి విశాఖలోనే బస చేసి మరుసటి రోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో పర్యటన ముగిసిన అనంతరం విశాఖ నుంచి హైదరాబాద్​ బయల్దేరి వెళ్లనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఓఎంసీ కేసులో ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి ఊరట.. కేసు కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
    TS HC Dismissed The OMC Case Against The IAS Officer : ఓబుళాపురం గనుల కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై సీబీఐ పేర్కొన్న అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఛార్జ్​షీట్​లో సీబీఐ నమోదు చేసిన సెక్షన్లకు తగిన ఆధారాలు లేవని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఆ సెక్షన్లు కాకుండా ఇతర చట్టనిబంధనలు వర్తిస్తాయేమో సీబీఐ కోర్టు పరిశీలించాలని హైకోర్టు సూచించింది. ఒకవేళ ఇతర అభియోగాలు వర్తిస్తే వాటి ప్రకారం శ్రీలక్ష్మిపై విచారణ కొనసాగించ వచ్చని హైకోర్టు పేర్కొంది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత.. కారణం అదే: మంత్రి ధర్మాన
    MINISTER DHARMANA : మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ‌ప్రజల్లో వ్యతిరేకత ఉందని శ్రీకాకుళం జిల్లాలోని గడప గడప కార్యక్రమంలో ప్రస్తావించారు. అయితే దానికి ప్రజలు సంస్కరణలు అర్థం చేసుకోకపోవడం వల్లే.. ఈ పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Ippatam: ఇప్పటం గ్రామస్థులకు పవన్​ అండ.. వారికి ఆర్థిక సాయం
    Pawan Kalyan: ఇప్పటం గ్రామస్థులకు మరోసారి పవన్​ అండగా నిలిచారు. ఇళ్లు కోల్పోయిన ఒక్కో కుటుంబానికి జనసేనాని లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ఆ మొత్తాన్ని స్వయంగా పవన్ కల్యాణ్ త్వరలోనే అందజేయనున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'చట్టానికి లోబడే తీర్పు'.. అత్యాచార దోషులకు శిక్ష రద్దుపై సుప్రీం వివరణ
    సామూహిక అత్యాచార కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు వ్యక్తులను నిర్దోషులుగా తేల్చడంపై విమర్శలు వెల్లువెత్తగా.. వాటికి తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. కింది కోర్టుల్లో ఈ కేసు విచారణ సమయంలో అనేక లోపాలు జరిగినట్లు పేర్కొంది. అత్యున్నత న్యాయస్థానంలో నిందితులు నేరానికి పాల్పడ్డారనేందుకు స్పష్టమైన ఆధారాలు సమర్పించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందన్న ధర్మాసనం.. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద వారికి విముక్తి కల్పించినట్లు స్పష్టం చేసింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పోలీసు ఇలాఖాలో ఆయుధాలు మాయం.. తుపాకీ బ్యారెళ్ల స్థానంలో పైపులు!
    రాజస్థాన్​లోని ఓ పోలీసు ఆయుధ శాఖలో ఆయుధాలు అదృశ్యం కావడం సంచలనంగా మారింది. దాదాపు 317 ఆయుధాలు మాయమయ్యాయని విచారణలో తేలింది. ఈ మేరకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ఆదేశాల మేరకు ఆ ఆయుధ శాఖ ఇన్‌ఛార్జ్‌పై కేసు నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'కాప్‌-27' సమావేశం నుంచి బయటికెళ్లిన రిషి సునాక్.. చెవిలో చెప్పిన కొద్దిసేపటికే!
    Cop 27 Rishi Sunak : పర్యావరణ సదస్సులో భాగంగా ఓ సమావేశంలో పాల్గొన్న బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అర్థాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన హడావుడిగా బయటికెళ్లిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్‌ అయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'వేషాలేస్తే ఖాతా తీసేస్తా' ఎలాన్​ మస్క్​ మాస్​ వార్నింగ్
    Elon Musk Warning : ఎలాన్ మస్క్​ ట్విట్టర్​ పిట్టని సంస్కరణల దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. ఇది వరకే సంస్థలోని సగానికి పైగా ఉద్యోగులను తొలగించిన మస్క్.. తాజాగా ఓ వార్నింగ్ ఇచ్చారు. అలా చేస్తే హెచ్చరికలు లేకుండానే ఖాతాలను తొలగిస్తామని తెలిపారు. ఇంతకీ ఏమన్నారంటే..పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • T20 World Cup ఫైనల్​లో టీమ్ఇండియా, పాకిస్థానే తలపడతాయి: డివిలియర్స్​
    De Villiers on T20 WC Final: టీమ్​ఇండియా, పాకిస్థానే ఫైనల్లో తలపడతాయని అన్నాడు సౌతాఫ్రికా లెజెండరీ ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్. బుధవారం (నవంబర్‌ 9), గురువారం (నవంబర్‌ 10)లలో జరగబోయే రెండు సెమీఫైనల్స్‌తో ఫైనల్లో తలపడబోయే టీమ్స్ ఏవో తేలనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ సూపర్​ హిట్​ సినిమాలో బాలకృష్ణను వద్దన్న ఎన్టీఆర్‌.. ఎందుకంటే?
    ఓ సూపర్ హిట్ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించడానికి సీనియర్​ ఎన్టీఆర్​ నో చెప్పారట. ఇంతకీ ఆ చిత్రం ఏంటి? ఎందుకు అలా అన్నారంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details