తిరుమలకు త్వరలో 200 ఎలక్ట్రిక్ బస్సులు! - తిరుమలకు త్వరలో 200 ఎలక్ట్రిక్ బస్సులు
తిరుమల కొండపై కాలుష్య నియంత్రణ చర్యలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎలక్ట్రిక్ బస్సులు నడపనుంది. బస్సులు కావాలని తితిదే చైర్మన్ సీఎం జగన్ను కోరగా.. 150-200 బస్సులకు అంగీకారం తెలిపారు.
ttd
తిరుమలకు త్వరలోనే 150 నుంచి 200 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్నట్లు రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. తిరుమల కొండపై కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన అభ్యర్థనపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని పేర్ని నాని తెలిపారు.