శుక్రవారం ఏపీ ఐసెట్‌ను 43 నగరాలలోని 98 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎస్వీయూ పర్యవేక్షిస్తోంది. 52వేల736 మంది విద్యార్థులు పరీక్షకు హజరుకానున్నారు. ఐసెట్ ఫలితాలను 10 రోజుల్లో విడుదల చేస్తామని ఎస్వీయూ వీసీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఉదయం 10 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12.30 కి ముగుస్తుందని... మధ్యాహ్నం పరీక్ష 2.30 నుంచి సాయంత్రం 5 గంటలకు పూర్తి అవుతుంది.