ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కౌంటర్​ దాఖలు చేయని తితిదే బోర్డు సభ్యులపై హైకోర్టు ఆగ్రహం - TD board members with criminal records

TTD BOARD MEMBERS Case: నోటీసులు అందుకున్న తితిదే బోర్డు సభ్యులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఆదేశాల ప్రకారం.. కౌంటర్ దాఖలు చేయకపోవడమేంటని ప్రశ్నించింది.

ttd board members
ttd board members

By

Published : Feb 7, 2022, 9:15 PM IST

TTD BOARD MEMBERS Case: తితిదే పాలకమండలిపై భాజపా నేత భానుప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. తితిదే బోర్డు సభ్యులు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ ప్రారంభిస్తామని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

కేసు వివరాలు ఇలా..
నేర చరిత్ర రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న 18 మందిని తితిదే పాలకమండలి సభ్యులుగా నియమించారంటూ భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి జి.భానుప్రకాష్ రెడ్డి గతంలో పిల్ వేశారు. విచారణ జరిపిన కోర్టు 18 మంది సభ్యులకు నోటీసులు ఇచ్చింది. జనవరి 4న జరిగిన విచారణలో పిటిషనరు తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. అల్లూరి మల్లేశ్వరి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంఎన్.శశిధర్​కు పంపిన నోటీసులు తిరిగి వచ్చాయని, మిగిలిన వారికి నోటీసులు అందాయని వివరించారు. తితిదే బోర్డులో నేర చరిత్ర కలిగి ఉండి న్యాయస్థానం నోటీసులు తీసుకోని ముగ్గురు బోర్టు సభ్యుల పేర్లను పేపర్లలో ప్రకటన ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తితిదే బోర్డు సభ్యులు వీరే..
ttd board members: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామక ప్రక్రియను గతేడాది ప్రభుత్వం పూర్తి చేసింది. 24 మంది సభ్యులతో కూడిన తితిదే కొత్త పాలకమండలి ఏర్పాటు చేసింది. తితిదే సభ్యులుగా పోకల అశోక్‌కుమార్‌, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కాటసాని రాం భూపాల్‌రెడ్డి(ఎమ్మెల్యే), టంగుటూరు మారుతి ప్రసాద్‌, బుర్రా మధుసూదన్‌ యాదవ్‌(ఎమ్మెల్యే), కలివేటి సంజీవయ్య(ఎమ్మెల్యే), డా.జూపల్లి రామేశ్వరరావు, మన్నె జీవన్‌రెడ్డి, బుదాటి లక్ష్మీనారాయణ, పార్థసారధి రెడ్డి, మురంశెట్టి రాములు, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు(ఎమ్మెల్యే), శ్రీనివాసన్, నందకుమార్‌, శశిధర్‌, విశ్వనాథ్‌రెడ్డి, మిలింద్‌, సౌరభ్‌, కేతన్‌ దేశాయ్‌, రాజేశ్‌ శర్మ, సనత్‌ కుమార్‌, అల్లూరు మల్లేశ్వరి, ఎస్‌.శంకర్‌ పాలకమండలిలో నియామకమయ్యారు. ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా రెవెన్యూ శాఖ కార్యదర్శి(దేవాదాయ), దేవాదాయ శాఖ కమిషనర్‌, తుడా ఛైర్మన్‌, తితితే ఈవో నియామకమయ్యారు. తితిదే బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుధాకర్‌ నియామకమయ్యారు. వీరిలో 18 మందికి నేర చరిత్ర ఉందని.., వారు తితిదే బోర్డు సభ్యులుగా కొనసాగటానికి వీల్లేదని హైకోర్టులో కేసు దాఖలు చేశారు.

ఇదీ చదవండి

Statue of Equality: సమతామూర్తి.. భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి : సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details