మద్యం దుకాణాల వద్ద నిబంధనలు పాటించామని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె. నారాయణ స్వామి స్పష్టం చేశారు. ప్రసార మాధ్యమాల్లో కనిపించిన దృశ్యాలన్నీ కొన్ని చోట్లకే పరిమితమని ఆయన వ్యాఖ్యానించారు. మిగిలిన చోట్ల భౌతిక దూరం పాటించాకే మద్యం విక్రయాలు జరిగాయని చెప్పారు. కొన్ని చోట్ల నిబంధనలు పట్టించుకోకపోవటంతో దుకాణాలను మూసివేశామని మంత్రి వెల్లడించారు. గ్రీన్జోన్లలో మాత్రమే మద్యం దుకాణాలు తెరుచుకున్నాయని నారాయణ స్వామి వివరించారు.
మద్యం దుకాణాలు తెరుచుకోవడానికి, మద్య నిషేధ హామీకి లింకు పెట్టి తెదేపా నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని నారాయణ స్వామి ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం మద్య నిషేదాన్ని దశల వారీగా అమలు చేసి తీరుతుందని అన్నారు. చంద్రబాబు ఇక భవిష్యత్తులోనూ రాజకీయ క్వారంటైన్ కాబోతున్నారని మంత్రి అన్నారు.