Anticipatory Bail to TDP Leaders in Punganuru and Angallu Incident: చిత్తూరు జిల్లా పుంగనూరు, అంగళ్లు ఘటనల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకూ హైకోర్టులో ఊరట లభించింది. మాజీమంత్రి దేవినేని ఉమ, కిషోర్ కుమార్, పులివర్తి నాని, చల్లా బాబులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పుంగనూరు, అంగళ్లు ప్రాంతాల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సైతం గాయాలయ్యాయి.
ఈ ఘటనల్లో ఇరువర్గాలు గొడవపడినా... పోలీసులు కేవలం టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని తెలుగుదేశం నేతలు దేవినేని ఉమా, పులివర్తి నాని, చల్లా బాబులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తమపై దురుద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేశారని.. పిటిషనర్లు కోర్టులో వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు... చల్లా బాబుపై మొత్తం ఏడు కేసులు నమోదు కాగా.. నాలుగు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసి.. మిగతా మూడు పిటిషన్లను కొట్టేసింది.
Chittoor SP Rishanth Reddy On Punganur Issue: 'పుంగనూరు ఘటనకు కారకులైన వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు'
పుంగనూరులో ఉద్రిక్తతలకు కారణాలు:అన్నమయ్య జిల్లా(annamayya district) తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలో.. కురబలకోట మండలం అంగళ్లు గ్రామం, ఆ తర్వాత చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతాల్లో.. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమం కోసం.. టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చిన సమయంలో.. యాత్రను అడ్డుకోవడానికి వైసీపీ నాయకులతోపాటు.. కార్యకర్తలు, పోలీసులు ప్రయత్నించారు. వైసీపీ నేతలు టీడీపీ(TDP) నేతలపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పోలీసులు వైసీపీ నేతల పట్ల ఉదాసీనంగా వ్యవహరించారని టీడీపీ నేతలు ఆరోపించారు. అంగళ్లు గ్రామంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. మెుదట టీడీపీ నేతలు సహనం ప్రదర్శించారు. అయితే, టీడీపీ జెండాలతోపాటుగా ఫ్లెక్సీలను వైసీపీ నాయకులు చించివేయడంతో పాటు... గోబ్యాక్ చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు. ఇంత జరుగుతున్నా వైసీపీ నేతలు కార్యకర్తలను పోలీసులు నియంత్రించలేదని టీడీపీ నేతలు వెల్లడించారు.
Petition in High Court on Punganur Incident: సంఘటనా స్థలంలో లేని వ్యక్తిపై కేసు.. ప్రాథమిక ఆధారాలున్నాయి: హైకోర్టు
టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు: ఈ ఘటనల్లో పార్టీ అధినేతచంద్రబాబుతో పాటు... వందల మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరో సంఘటనలో సుమారు 12 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. 317 మందిపై హత్యాయత్నంతో పాటుగా.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 81 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ పలువురు టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
TDP Leaders Arrest: "అరెస్టు చేసి ఒత్తిడి తీసుకువచ్చి.. తప్పుడు స్టేట్మెంట్లపై సంతకాలు పెట్టిస్తున్నారు"