తిరుపతి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకట చలపతినాయుడు ఇంట్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారన్న ఆరోపణలపై... ఆయన సహోద్యోగులు మాధవరావు, వెంకటరామిరెడ్డి, బాలకృష్ణారెడ్డి నివాసాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. తిరుపతిలోని అన్నారావు కూడలి సమీపంలో వెంకట చలపతినాయుడు నివాసం, నగరంలో మరో రెండు చోట్ల, చంద్రగిరి, చిత్తూరు, కడప జిల్లా రాయచోటి, బెంగళూరులోని వారి బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. పలు దస్త్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు... వాటికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ సోదాల పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని అనిశా అధికారులు తెలిపారు.
అటవీశాఖాధికారుల నివాసాల్లో అనిశా సోదాలు - తిరుపతి అటవీశాఖాధికారుల నివాసాల్లో అనిశా దాడులు
చిత్తూరు జిల్లాలోని అటవీశాఖాధికారుల నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. చిత్తూరు, కడప, కర్ణాటకలో ఉన్న ఉద్యోగుల కుటుంబసభ్యుల ఇళ్లలోనూ ఏకకాలంలో దాడులు చేశారు.
అటవీశాఖాధికారి భవనం
ఇదీచూడండి. తిరుమలలో ఏనుగుల గుంపు సంచారం.... ఆందోళనలో భక్తులు