ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రుణ యాప్‌ల కేసులో చిత్తూరుకు చెందిన వ్యక్తి అరెస్టు - లోన్​ యాప్ అరెస్టు

రుణ యాప్‌ల కేసులో చిత్తూరుకు చెందిన వ్యక్తి అరెస్టు
రుణ యాప్‌ల కేసులో చిత్తూరుకు చెందిరుణ యాప్‌ల కేసులో చిత్తూరుకు చెందిన వ్యక్తి అరెస్టున వ్యక్తి అరెస్టు

By

Published : Mar 11, 2021, 3:07 PM IST

Updated : Mar 11, 2021, 3:54 PM IST

15:06 March 11

రుణ యాప్‌ల కేసులో మరో నిందితుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో చిన్నబ్బ రాజశేఖర్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చిత్తూరుకు చెందిన రాజశేఖర్‌ బెంగళూరులో ఉంటూ తొమ్మిది టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలకు సంచాలకుడిగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 

ఈ తొమ్మిది కంపెనీలు స్నాపిట్‌, ఓకే క్యాష్‌, మై బ్యాంక్, క్యాష్‌ బీ, రూపీ ఫ్యాక్టరీ, బబుల్‌ లోన్‌, గో క్యాష్​తో పాటు పలు రుణ యాప్‌లతో ఒప్పందం కుదుర్చుకుని రుణాలు తీసుకున్న వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు చైనాకు చెందిన ల్యాంబోతో సహా 21 మందిని పోలీసులు ఈ వ్యవహారంలో అరెస్టు చేశారు. కంపెనీ ఖాతాల్లోని రూ.300 కోట్లను ఇప్పటి వరకు పోలీసులు స్తంబింపజేశారు.

ఇదీ చదవండి:విశాఖ ఉక్కు సీఎండీకి సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలు

Last Updated : Mar 11, 2021, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details