చిత్తూరు జిల్లాలో ఈరోజు మరో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని వి.కోటలో 5, సత్యవేడులో 2, వరదయ్యపాలెం, బీ.ఎన్ కండ్రిగ, తిరుపతి రూరల్, మదనపల్లెలో ఒక్కొక్క పాజిటివ్ కేసు చొప్పున నమోదైనట్లు అధికారులు తెలిపారు. నమోదైన కేసుల్లో అత్యధికం చెన్నై-కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్న వారిగానే అధికారులు గుర్తించారు.
వి.కోట మార్కెట్‌ను మూసివేయడమే కాక.. ఆయా ప్రాంతాలను రెడ్జోన్లుగా అధికారులు ప్రకటించారు. పారిశుద్ధ్యం పనులను నిర్వహిస్తున్నారు. తాజా కేసులతో కలిపి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 96కి చేరింది. ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య74కి చేరుకోగా... యాక్టివ్ కేసుల సంఖ్య 22కి తగ్గింది.