చిత్తూరు జిల్లా.. పడమటి మండలాల్లో లాక్డౌన్ అమలవుతోంది. అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని తల్లులు, పిల్లలకు ఐసీడీఎస్ అధికారులు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారు. మే ఆఖరి వరకు సరిపోయే విధంగా 3 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అర లీటర్ నూనె, 23 గుడ్లు, 4 లీటర్ల పాలు, పిల్లలకు 2.5 కిలోల బాలామృతం ప్యాకెట్లు, 8 గుడ్లు ఇంటింటికీ వెళ్లి అంగన్వాడీ కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారు. ఇవాళ సీడీపీఓ లు తంబళ్లపల్లె ప్రాజెక్టు పరిధిలోని కేంద్రాల్లో పౌష్టికాహార పంపిణీని పర్యవేక్షించారు.
తల్లీపిల్లలకు నేరుగా ఇంటికే పౌష్టికాహారం - చిత్తూరులో అంగన్వాడీ కేంద్రాలు
చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ పరిధిలో ఉన్న తల్లీ, పిల్లలకు ఐసీడీఎస్ అధికారులు నేరుగా ఇంటికే వెళ్లి పౌష్టికాహారం అందిస్తున్నారు.
![తల్లీపిల్లలకు నేరుగా ఇంటికే పౌష్టికాహారం anganwadi centers in chittor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7084290-341-7084290-1588763190056.jpg)
anganwadi centers in chittor