ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇక్కడ మద్యం దుకాణాలు వెలవెలబోతున్నాయి..! - Andhra Tamil Nadu border wine shops news

ఆంధ్ర- తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన చిత్తూరు జిల్లా కండ్రిగలో తెరుచుకున్న మద్యం దుకాణాల వద్ద తొలి రెండు రోజులు కనిపించిన మందుబాబులు... ప్రస్తుతం కనిపించడం లేదు. మరోపక్క జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో రాష్ట్రానికి అక్రమంగా తీసుకొస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

వెలవెలబోతున్న ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు మద్యం దుకాణం
వెలవెలబోతున్న ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు మద్యం దుకాణం

By

Published : May 7, 2020, 9:22 PM IST

Updated : May 7, 2020, 11:49 PM IST

లాక్​డౌన్​ నిబంధనల సడలింపులతో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో తెరుచుకున్న మద్యం దుకాణం తొలి రెండురోజులు మందుబాబులతో కిక్కిరిపోయింది. ప్రస్తుతం కొనుగోలుదారులు లేక వెలవెలబోయింది. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం కండ్రిగ ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతం. తమిళనాడులో లాక్​డౌన్​ అమలు కొనసాగుతున్న కారణంగా కండ్రిగలోని మద్యం దుకాణాల ముందు మందుబాబులు మొదటి రెండురోజులు బారులు తీరారు. కానీ ప్రస్తుతం దుకాణాల వద్ద వినియోగదారులు కనిపించడం లేదు.

జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలం గారచెట్లపల్లి గ్రామం ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతం. ఈ గ్రామం ద్వారా కర్ణాటక రాష్ట్ర మద్యాన్ని చిత్తూరు జిల్లాకు అక్రమంగా తీసుకొస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ములకలచెరువు ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

ఇదీ చూడండి:'మద్యం దుకాణాలతో అనర్థాలు తప్పవు'

Last Updated : May 7, 2020, 11:49 PM IST

ABOUT THE AUTHOR

...view details