చిత్తూరు జిల్లా పరిధిలో.. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో మద్యం తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాలతో తమిళనాడు - ఆంధ్రా సరిహద్దులో గల ఆంధ్ర చెక్ పోస్టులను పటిష్టపరచారు.
ఈ క్రమంలో... తమిళనాడు రాష్ట్రంలో మద్యం లభించనందువల్ల కొందరు తమిళనాడు వ్యక్తులు ఆంధ్రలోకి వచ్చి.. ఇక్కడి మద్యాన్ని అక్కడికి తరలిస్తూ.. పట్టుబడ్డారు. నగిరి - తమిళనాడు సరిహద్దులోని పూని - మాంగాడు చెక్ పోస్ట్ వద్ద నగిరి పోలిసు తనిఖీలు చేస్తుండగా టాటా సఫారీ వాహనంలో ఐదుగురు వ్యక్తులు 7 ఫుల్ బాటిల్స్, 3 హాఫ్ బాటిల్స్, 125 క్వార్టర్ బాటిల్ అక్రమoగా మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు.